ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయింది. ముందుగా జ్యూరిచ్ హిల్టన్ హోటల్ లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం బృందం సమావేశాలు నిర్వహించింది. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనుకూలంగా ఉందని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘జాబ్స్ ఫర్ తెలుగు’ కార్యక్రమంలో భాగంగా ఏపీలోనూ, యూరప్ లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ఈసందర్భంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో ఉన్న విస్తృత అవకాశాలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు.
Previous Articleఈ దర్శకులలో ఎవరు చిరంజీవి అభిమానుల ఆకలి తీరుస్తారు
Next Article ‘కాంతార’ చిత్రబృందంపై కేసు నమోదు!