రిషబ్ షెట్టి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార’ చిత్రం చిక్కుల్లో చిక్కుకుంది.ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు.అయితే అడవిలో షూటింగ్ చేయడం వలన అటవీ ప్రాంతం నాశనం అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ షూటింగ్‌కి గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో ప్రభుత్వం అనుమతినివ్వగా..చిత్రబృందం మాత్రం అక్రమంగా అడవిలోకి వెళ్లి షూట్ చేస్తుందని తెలిపారు.అంతేగాకుండా.. ఈ సినిమా షూటింగ్ కోసం పేలుడు పదార్థాలు ఉపయోగిస్తున్నారని దీనివలన అడవిలో ఉన్న పక్షులతో పాటు మూగజీవాలు భయాందోళనకి గురవతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.అలాగే ఈ షూటింగ్ వలన పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.అయితే ఈ విషయంలోనే గ్రామస్థులకు చిత్రబృందంకి గొడవ జరుగుగా..గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్ర బృందం దాడి చేసిందని తెలిపారు.దీంతో స్థానిక గ్రామస్థులంతా యెసలూరు పోలీస్ స్టేషన్ లో కాంతార చిత్రబృందంపై కేసు నమోదు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు