ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అభివృద్ధి పనులు సరిగా చేయలేమని ఇదే కొనసాగితే చివరికి బాధపడేది ప్రజలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలి. అభివృద్ధి పనులపై నిధులు ఎక్కువ ఖర్చు చేయాలని అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుందని పేర్కొన్నారు . అలాగని అప్పులు చేసి.. పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయని వివరించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో అప్పులు తెచ్చి, అభివృద్ధి గురించి పూర్తిగా మర్చిపోయారని నీతి ఆయోగ్ రిపోర్ట్ బయట పెట్టింది. అప్పు తెచ్చి ఆదాయం పెంచే వాటి పై ఖర్చు చేయకుండా, రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి నెట్టేశారని ఆక్షేపించారు. ప్రధాని అధ్యక్షత వహించే నీతి ఆయోగ్, స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌పై నివేదిక ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసానికి నీతి అయోగ్ నివేదికే నిదర్శనమని పేర్కొన్నారు . నాయకుల సమర్థతపై ఆ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని నాయకుల అసమర్థత వలన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది అనటానికి, ఈ నివేదికే ఒక ఉదాహరణ అని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు