కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ లపై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్ లోని మహు లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర్యానికి ముందు పరిస్థితులు కోరుకుంటున్నాయని ప్రజలను మరోసారి బానిసలుగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుండి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం ఒక ముఖ్యమైన మైలురాయి, ఎందుకంటే ఆ తర్వాత మొదటిసారిగా భారతదేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు మరియు పేదలకు రాజ్యాంగం ద్వారా హక్కులు లభించాయి. కానీ, మోహన్ భగవత్ అది నిజమైన స్వాతంత్ర్యం కాదని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ మరియు ఆర్.ఎస్.ఎస్ భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని మండిపడ్డారు.
విద్యా వ్యవస్థ పైనా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు రంగ విద్యా, వైద్య రంగంలో యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది? మన విద్యా రంగం సర్టిఫికెట్ల వ్యవస్థగా మారిందని అన్నారు. సర్టిఫికెట్లు వస్తే ఉద్యోగాలు వస్తాయని కోట్లాదిమంది ప్రజలు భావిస్తున్నారని అదంతా నిజం కాదని అలా చేస్తే మీ పిల్లలు ఏ ఉపాధి పొందలేరని అన్నారు. దేశం ఉపాధి వ్యవస్థను ఈ బిలియనీర్లు నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది: రాహుల్ గాంధీ
By admin1 Min Read
Previous Articleరాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలి: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article సూర్య ఫామ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..!