రేపటి నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనపై గళం విప్పాలని కోరుతూ ఏపీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏంటని షర్మిల ప్రశ్నించారు. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోడీ గారు..రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూటమి ఎంపీలు తమ గళం విప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు హోదా ఇస్తామని ఇచ్చిన మాట మీద ప్రధాని మోడీ గారిని నిలదీయాలని పేర్కొన్నారు. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని హెచ్చరించారు.
కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నాం. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోడీ గారు..రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఈ నెల 31 నుంచి జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మీ… pic.twitter.com/8rBrbPc7Zh
— YS Sharmila (@realyssharmila) January 30, 2025