తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరిస్తూ మాజీ మంత్రి , వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలుస్తుందని, మా నాయకుడు జగన్ మళ్ళీ సీఎం అవుతారని, అప్పుడు టీడీపీ కార్యకర్తలు తాట తీస్తామని అన్నారు.వైసీపీ నేతలు,కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారు అని చెప్పారు.సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టిన వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగుదేశం కార్యకర్తల పని పడతామని తీవ్రంగా హెచ్చరించారు.మాపై దాడులు చేసిన వారిపై ఖచ్చితంగా ప్రతి దాడులు చేస్తామని అన్నారు.మా తడాఖా ఏంటో రుచి చూస్తారని మండిపడ్డారు.ఇకపై జగన్ కు ప్రతి కార్యకర్త అండగా ఉంటామని జగన్ చెప్పారని తెలిపారు.ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.