ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించారు. ఇటీవల కుంభమేళాలో జరిగిన తొక్కసలాట ఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గతేడాది చివరిలో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు.
రాష్ట్రపతి ప్రసంగంలో కీలక అంశాలు:
25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ దిగువ నుండి పైకి తీసుకొచ్చాం. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలను అమలు చేస్తున్నాం.
రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్ లో ప్రాధాన్యత.
ఆయుష్మాన్ భారత్ తో 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం.
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుంది. గత ప్రభుత్వాల కంటే ఎన్టీయే ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పని చేస్తోంది.
కొత్త ఎడ్యుకేషన్ పాలసీతో ఆధునిక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశాం. యువతకు నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం.
పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం. అదనంగా మూడు కోట్ల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను పొడిగింపు.
ఒకే దేశం – ఒకే ఎన్నిక, వక్స్ సవరణ బిల్లు అమలు దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం:ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
By admin1 Min Read
Previous Articleటీడీపీ కార్యకర్తల భరతం పడతాం:- మాజీ మంత్రి పెద్దిరెడ్డి
Next Article ప్రభాస్ ఆతిధ్యానికి హీరోయిన్ ఇమాన్వీ ఫిదా…!