పంచాయతీరాజ్ శాఖ, రూ. 104.25 కోట్ల వ్యయంతో కొత్తగా 417 గ్రామ పంచాయతీ కార్యాలయాలను, కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుతో నిర్మాణం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో 200 పంచాయతీలు ఇప్పటివరకు పంచాయతీ కార్యాలయాలు లేని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అలాగే పంచాయతీలలో వేగంగా గ్రామాల్లో సేవలు అందించేలా 1,422 నూతన కంప్యూటర్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 46.137 కోట్ల నిధులు విడుదల చేసిన పంచాయతీరాజ్ శాఖ. మిగతా 60% నిధులు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందని తెలిపింది.
గ్రామ పంచాయతీలకు కొత్త శోభ:రూ. 104.25 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు
By admin1 Min Read
Previous Articleవిద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లు సిద్ధం..!
Next Article ధరలు పెరిగేవి…ధరలు తగ్గేవి ఇవే..!