అభివృద్ధి బాటలో పరుగులు తీస్తున్న భారత్ ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల దావోస్ పర్యటనలో కూడా దీనిని గమనించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఐటీపై ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి పెరిగిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మాట్లాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో భారత్ వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతోందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఇటీవల బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ట్యాక్స్ సంస్కరణల్లో చాలా మార్పులు జరిగాయి. విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రథమంగా ఏపీలోనే జరిగాయని తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ గేమ్ఛేంజర్ గా మారబోతోందన్నారు దేశంలో పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని పెట్టుబడులకు చాలా మంది ముందుకొస్తున్నారని తెలిపారు . కొత్త ఆవిష్కరణలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతోంది. వృద్ధిరేటు పెంచేలా ఈ బడ్జెట్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ మ్యాన్ లలో భారతీయులే ప్రముఖంగా ఉంటున్నారని పేర్కొన్నారు.
Previous Articleశ్రీకాకుళంలో వైభవంగా రథసప్తమి ఉత్సవాలు
Next Article నాని – అనిరుధ్ కాంబోలో మూడోవ చిత్రం..!