నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ మంచి విజయాన్ని అందుకుంది.నాని కెరీర్‌లో తొలి వందకోట్ల సినిమా ‘దసరా’.తాజాగా అదే కాంబినేషన్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి ‘ది ప్యారడైజ్’ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది.త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు.నాని కూడా ఈ సినిమా కోసం ఇంటెన్స్‌గా జిమ్ చేస్తూ మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు.అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుథ్ ఖరారైనట్టు చిత్రబృందం నిన్న ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
కాగా జెర్సీ,గ్యాంగ్‌లీడర్ చిత్రాల అనంతరం నాని, అనిరుథ్ కలిసి పనిచేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.ఈ మేరకు నాని తన ఎక్స్‌లో ‘మేం మా హ్యాట్రిక్‌పై ఉన్నాం..ఇది ఒక అద్భుతం అవుతుంది.. ప్యారడైజ్ ఇప్పుడు నాని, అనిరుథ్, ఓదెల సినిమా..స్వాగతం డియర్ అనిరుథ్..’ అంటూ పోస్ట్ చేయగా,‘ఇది చాలా స్పెషల్ మై డియర్ నాని.. వెర్రిగా పోదాం..’ అంటూ అనిరుథ్ రిప్లయ్ ఇచ్చారు.అయితే ఈ చిత్రం నాని కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ సినిమా అని చిత్రబృందం తెలిపింది.