ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశం వివరాలను వెల్లడించారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించా. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కోరా. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరాను. అనంతపురంలో రక్షణా పరిశ్రమలకు గల అనుకూలతల గురించి రక్షణశాఖా మంత్రికి వివరించాం. ఢిల్లీలో ఉక్కు శాఖా మంత్రిని కలిసి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజ్ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపాం. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వచ్చిన భయమేమీ లేదని ఈసందర్భంగా స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్రమంత్రే తెలిపారు. నిర్వహణ సరిగా లేకే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయని ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో రాజీనే లేదని స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్ట్ కట్టి తీరుతామని లోకేష్ పునరుద్ఘాటించారు. వైసీపీ ఫేక్ ప్రచారం నమ్మవద్దని సూచించారు. విద్యా శాఖా మంత్రిగా, రేపటి పౌరులని నేను తయారు చేయాలి. ఇష్టం వచ్చినట్టు నేను నిర్ణయాలు తీసుకుంటాను అంటే కుదరదు. ఏమైనా తేడా వస్తే, ఎన్నో సోషల్ ఇష్యూస్ ఉంటాయి. విద్యా శాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి, ఒక నిర్ణయం తీసుకుంటున్నామని లోకేష్ వివరించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

