ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన హాస్పిటల్స్ లో చికిత్స పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రిఫరల్ హాస్పిటల్స్ ను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత చాలామంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక నుండి తెలంగాణ డీఎంఈ గుర్తించిన హాస్పిటల్స్ లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు