హామీ ఇచ్చిన ఒక్క పథకమూ ఇవ్వలేదు. కానీ రాష్ట్రం అప్పులు మాత్రం కొండల్లా పెరిగిపోయాయి. మరి ఈ డబ్బంతా ఏమైపోయింది.ఎక్కడికి వెళ్తోంది..ప్రజలకు సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో చెప్పిన హామీలను నెరవేర్చలేమని 9 నెలల్లోనే చేతులెెత్తేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో దేశ జీడీపీ కన్నా రాష్ట్ర జిడిపి ఎక్కువగా ఉండేది. మా పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనించింది. దీన్ని ఎవరూ కాదనలేరని జగన్ అన్నారు. హామీలకు గ్యారెంటీ అని ఇంటింటికీ బాండ్లు పంపించారు.ఇప్పుడు ఆ బాండ్లు ఏమయ్యాయి..? మేనిఫెస్టోలో హామీలు ఏమయ్యాయి..? పంచిన పాంప్లెట్లు ఏమయ్యాయి..? ఎవరి చొక్కా పట్టుకోవాలి? చంద్రబాబుగారి పాలనలో అప్పులు రికార్డులు బద్దలు కొట్టేశాయి. 9 నెలల్లో మొత్తంగా రూ.1,45,000 కోట్లు ఇది ఇంకో రికార్డు. ఎన్ని అప్పులు చేసినా.. సూపర్ సిక్స్.. పేదలకేమైనా బటన్ నొక్కారా? అని ప్రశ్నించారు. దావోస్ వెళ్లిన ప్రతిసారీ పరిశ్రమలు వచ్చేస్తున్నాయి అని ఊదరగొడతారు. కానీ వాస్తవానికి ఒక్క కంపెనీ కూడారాలేదు. కానీ జనాన్ని మోసం చేయడానికి ఆ సదస్సు బాగా ఉపయోగపడుతుందని దుయ్యబట్టారు. దావోస్ పర్యటనతో కంపెనీలన్నీ ఏపీకి వచ్చేస్తున్నట్లు అప్పట్లో ఊదరగొట్టారు.. కానీ ఒక్క కంపెనీ కూడా రాలేదని ఆక్షేపించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో పురోగతి సాధించింది. చంద్రబాబు ఉన్నపుడు జాతీయ స్థాయిలో ఏపీ పారిశ్రమికంగా ఎంతో వెనుకబడి ఉండేది. ఆ పరిస్థితులను మార్చామని జగన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తామే ఎక్కువ ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ఇప్పుడు టీడీపీ చేస్తున్నది అభివృద్ధి కాదు.. కంప్లీట్ విధ్వంసం..దీంతో రాష్ట్రానికి ఎనలేని నష్టం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రానికి మెడికల్ సీట్లు ఇస్తామని కేంద్రం చెప్తుంటే.. చంద్రబాబు మాత్రం మాకు సీట్లు వద్దంటూ ఇప్పుడున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడని ఆరోపించారు. ఫార్టీ ఇయర్స్ చంద్రబాబు అనుభవం అప్పులు చేయడానికి పనికొచ్చింది తప్ప రాష్ట్రానికి పైసా లాభం లేకపోయింది. చీటింగ్ లో PHD తీసుకున్న వ్యక్తి బాబు. ఇలాంటి మోసగాన్ని నమ్మినందుకు ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని జగన్ మండిపడ్డారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు