వైయస్‌ఆర్‌సీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆపార్టీలో చేరారు. శైలజానాథ్ తో పాటు వైఎస్సార్‌సీపీలో చేరిన ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడులు ప్రతాప్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, వేంపల్లి సతీష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, మేరుగ నాగార్జున, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక శైలజా నాథ్ అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుండి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
Previous Articleఇక తెలంగాణలోనూ గుర్తింపు పొందిన పార్టీగా ‘జనసేన’
Next Article ఫిబ్రవరిలో వేణు “ఎల్లమ్మ ” కు ముహూర్తం ఫిక్స్ ?