ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీ తెలంగాణ లో కూడా గుర్తింపు పొందింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ప్రాంతీయ పార్టీగా గుర్తించిందని అలాగే తెలంగాణ లో కూడా గుర్తించి గాజు గ్లాసు గుర్తును ఇవ్వాలని ఆ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు. ఈమేరకు అనుమతిస్తూ ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Previous Articleఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు… నాకు ఏ భయం లేదు: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్ట్
Next Article జగన్ సమక్షంలో వైసీపీ లోకి మాజీ మంత్రి శైలజానాథ్