దేశంలో విమాన విడిభాగాల తయారీపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, మంత్రిత్వశాఖ అధికారులు పాల్గొన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, విమానయాన తయారీలో భారత్ ను ప్రపంచానికి కేంద్రంగా మార్చే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. దేశం యొక్క సొంత ప్రాంతీయ రవాణా విమానాలను అభివృద్ధి చేయడంపై ఈ సమావేశం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన ‘ఎక్స్’ లో తెలిపారు. దేశ వృద్ధిలో స్వయం సమృద్ధ విమానయాన రంగంగా మన ఎంఆర్ఓ(మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్స్) పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా నిలవడమే కీలకంగా చర్చలు సాగాయని పేర్కొన్నారు.
ప్రజల పట్ల అంకితభావానికి ఇదే నిదర్శనం
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం, పార్లమెంటు సభ్యుడిగా పదేళ్ల పోరాటం, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరడం ఆనందంగా భావిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలోని డబల్ ఇంజన్ సర్కార్ చిత్తశుద్ధికి, ప్రజల పట్ల అంకితభావానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
Previous Articleఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నామినేషన్
Next Article అభివృద్ధి, సుపరిపాలనదే విజయం: ప్రధాని మోడీ