ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. ఆ పార్టీ 47 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టి బోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బీజేపీ విజయంపై స్పందించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
జనశక్తి ప్రధానం! అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు విజయాన్ని అందించారని తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదరీమణులు మరియు సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆశీర్వాదాలు పొందడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో అలాగే వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించేలా చేయడానికి కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ అద్భుతమైన ఫలితానికి కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు