ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా మహిళల కోసం “వర్క్ ఫ్రమ్ హోమ్”ని ప్లాన్ చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’ సందర్భంగా మహిళలు మరియు బాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. COVID-19 అప్పుడు వర్క్ చేసే విధానంలో వచ్చిన మార్పులు ముఖ్యంగా అందుబాటులో ఉన్న సాంకేతికతతో, “వర్క్ ఫ్రమ్ హోమ్” ప్రాముఖ్యతను సంతరించుకుందని పేర్కొన్నారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్‌లు (CWS) మరియు నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్‌లు (NWS) వంటి కాన్సెప్ట్‌లు అనువైన, ఉత్పాదక పని వాతావరణాన్ని సృష్టించడానికి వ్యాపారాలు మరియు ఉద్యోగులను శక్తివంతం చేయగలవని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కు ఉపయోగపడతాయని అన్నారు. ఏపీలో అర్ధవంతమైన మార్పును తీసుకురావడానికి ఈ విధానాలను ఉపయోగించుకోవాలని ప్రణాళికలు వేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ IT & GCC పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ ఛేంజర్ కానుందని తెలిపారు. ప్రతి నగరం/పట్టణం/ మండలంలో IT కార్యాలయ స్థలాలను రూపొందించడానికి డెవలపర్లకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాము మరియు అట్టడుగు స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు IT/GCC సంస్థలకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలు మెరుగైన శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా నిపుణులు, సౌకర్యవంతమైన రిమోట్/హైబ్రిడ్ వర్క్ ఆప్షన్ల ద్వారా ప్రయోజనం పొందుతారన్నారు.
ప్రధానంగా మహాళల కోసం ‘వర్క్ ఫ్రం హోమ్’: పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు
By admin1 Min Read
Previous Articleఢిల్లీలో కేంద్రమంత్రి కుమారస్వామి తో పురందేశ్వరి భేటీ.
Next Article అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం