రాష్ట్ర పర్యాటక శాఖ సంబంధిత అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ…హ్యాపీ అని పర్యాటకులు భావించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది టూరిజం శాఖలో 20 శాతం వృద్ధిరేటు సాధించాలని అన్నారు. టెంట్ సిటీలుగా గండికోట, సూర్యలంక, లంబసింగి. టూరిజం, కల్చరల్ రంగాల్లో ఈవెంట్ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష:
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, కొత్తగా నిర్మాణం చేపట్టబోయే నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Previous Articleబర్డ్ ఫ్లూ పై ఆందోళన చెందాల్సిన పనిలేదు: మంత్రి అచ్చెన్నాయుడు
Next Article మణిపూర్ లో రాష్ట్రపతి పాలన