ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలని చెప్పామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.స్వచ్ఛాంధ్ర ,స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని దూబగుంట గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వేస్ట్ టు వెల్త్ సహా వివిధ మోడల్స్ ని చంద్రబాబు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్క రోజు మన ఊరు శుభ్రంగా ఉంచటానికి పని చేయాలని పరిసరాలు శుభ్రంగా ఉంటే, మంచి ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ ఎనర్జీతో సమర్ధవంతంగా మనం పని చేస్తామని పేర్కొన్నారు.జీవనప్రమాణాలు పెంచే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పని ప్రాంతాల్లో పరిశుభ్రతను ఒక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రతినెల పేదల సేవలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పెన్షన్లు 1వ తేదీనే ఇంటివద్దకు తీసుకెళ్లి ఇస్తున్నట్లు వివరించారు. ఏడాదికి రూ.33 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ప్రజల్లో ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడా లేని ధైర్యం వస్తుంది. ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పునకు అసలు, వడ్డీలు కట్టాలి. మరో పక్క మా ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించాం.పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్‌శాఖకు అప్పగించాం. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నాం. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు