రెబెల్ స్టార్ ప్రభాస్,స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలయికలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్”.ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం నిర్మించనున్నారు.ఇందులో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రంలో పలు పాత్రల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటించారు.అయితే నటులు కావలెను అంటూ సోషల్ మీడియా వేదికగా స్పిరిట్ చిత్రబృందం ప్రకటన విడుదల చేసింది.అన్ని ఏజ్ గ్రూప్ పురుషులు,మహిళలు…సినిమా,నాటకరంగ నేపథ్యం ఉన్నవారు కావాలి అని ఆ ప్రకటనలో తెలిపారు.తాజాగా స్పిరిట్ సినిమా కాస్టింగ్ కాల్ పై మంచు విష్ణు కూడా స్పందించారు.ఈ మేరకు మంచు విష్ణు ” యో… నేను కూడా ఈ సినిమాకు అప్లై చేశాను… ఏం జరుగుతుందో చూడాలి అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Yo! I applied. Now let’s wait and see 💪🏽🥰 https://t.co/PXNOPrl5aS
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2025