తిరుపతి వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, 58 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని అభివృద్ధికి కూడా ప్రధాన ఆదాయ వనరుల్ని పేర్కొన్నారు. టెంపుల్ టూరిజం దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మహాకుంభమేళాలో 55 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అన్నారు. అందరూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తున్నారని వాటిని ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ వ్యవస్థ మన దేశానికి ఉన్న అతిపెద్ద బలమని పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది కీలకపాత్రని చెప్పారు. దేవుడికి సేవ చేయడం అన్నింటికంటే గొప్పదని అన్నారు. తిరుమల కోట్లాది మంది శ్రీవారిపై భక్తులకు విశ్వాసమని పేర్కొన్నారు. ఏపీలోని దేవాలయాలకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో 75 శాతం పచ్చదనం ఉండేలా చూస్తున్నాం. ఏపీలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో గ్రీన్ ఎనర్జీ వినియోగించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో మరింత ముందుకెళ్లాలి. దేవాలయాల నిర్వహణలో సాంకేతికతను వినియోగించాలి.ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో, ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. ఎక్కడ తెలుగు వారు అంటే, ఆయా దేశాల్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. ఈ దిశగా టీటీడీ పని చేసి, దేవాలయాలు నిర్మిస్తుంది.పీ-4 విధానంలో దేశంలో మౌలిక వసతులు మరింత పెరగాలి. దేవుడి సేవ మాత్రమే కాదు, మానవ సేవ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు