రేపటి నుండి ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ2025 ప్రారంభం కానుంది. భారత్ ఆడే మ్యాచ్ లు మినహా మిగిలిన అన్ని మ్యాచ్ లు పాకిస్థాన్ వేదికగా జరుగనున్నాయి. భారత్ యూఏఈ లో జరగనుంది.ఇక ఈ మెగా ఈవెంట్ లో భారత స్టార్ బౌలర్ బుమ్రా గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇది కొంత లోటే అయినప్పటికీ భారత బౌలింగ్ లైనప్ మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ వంటి మేటైన బౌలర్లతో పటిష్టంగా కనబడుతోంది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరు మంచి ఆల్ రౌండర్లుగా అదరగొడుతుండడం భారత్ కు మరో సానుకూలాంశం. ఇక బ్యాటింగ్ విభాగంలో సీనియర్లు, జూనియర్లతో మంచి కూర్పు ఉండే అవకాశాలున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో తన మునుపటి ఫామ్ ను అందుకున్నాడు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తే మరో ఐసీసీ ట్రోఫీని భారత్ ముద్దాడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ఈనెల 19న భారత్-బంగ్లాదేశ్ లో ఈ ట్రోఫీలో తలపడనున్నాయి. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు