జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సింఘానియా గ్రూప్ (రేమండ్స్), ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమేరకు లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా సింఘానియా స్కూల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదట తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, విద్యా నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణతో పాటు… సాంకేతిక అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని సాధించేందుకు పాఠశాలల నిర్వహణలో మార్పులు తీసుకురానున్నారు. ఐదేళ్ల వ్యవధిలో అమలుచేసే ఈ కార్యక్రమం ద్వారా 1 లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని లోకేష్ తెలిపారు. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరిస్తారని వివరించారు . రాబోయే రోజుల్లో రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈసందర్భంగా స్పష్టం చేశారు.
Previous Articleఛాంపియన్స్ ట్రోఫీ 2025:వివాదానికి తెర…ఆ స్టేడియం పై భారత పతాకం
Next Article సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు యూపీఎస్‌సీ గుడ్ న్యూస్