సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు యూపీఎస్‌సీ గుడ్ న్యూస్ తెలిపింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష అప్లికేషన్ గడువును యూపీఎస్‌సీ మరోసారి పొడిగించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకునేందుకు వీలు కల్పించింది. ఆల్ ఇండియా సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి గానూ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గత నెల 22న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా, ఆ గడువును ఫిబ్రవరి 18వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు నిన్నటితో ముగియనుండటంతో ఫిబ్రవరి 21 వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న నిర్వహించనున్నారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని ఫిబ్రవరి 22 నుండి 28వ తేదీ వరకు సవరించుకునేందుకు వీలు కల్పించింది. మరోవైపు ఇండియన్ ఫారెస్టు సర్వీసులో మరో 150 పోస్టులకు కూడా దరఖాస్తుల గడువును ఈనెల 21 వరకు పొడిగించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు