వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకి అండగా నిలిచి భరోసానిచ్చినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని జగన్ అన్నారు. రైతుల దీనస్థితికి ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. తమ హయాంలో వ్యవసాయం పండగలా మారిందని రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామని పేర్కొన్నారు . కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. మిర్చి రైతుల ఇబ్బందులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. ప్రస్తుతం క్వింటాకు రూ.10-12 వేలు కూడా రావడం లేదని తమ హయాంలో రూ.21 నుంచి 27 వేల వరకు ధర వచ్చేదని తెలిపారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఉందని వైఎస్ జగన్ ఆక్షేపించారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు: మాజీ సీఎం జగన్
By admin1 Min Read