ఇష్టం వచ్చినట్లు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ…కొంతమంది బుద్ది ఏ మాత్రం మార్చుకోవడం లేదు.తమకు గిట్టని వ్యక్తులపై అనుచిత పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు.కాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై హర్షవర్ధన్ రెడ్డి అనే అతను ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.ఇటీవల కుంభమేళాలో తన భార్య అనా,కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,టీటీడీ సభ్యుడు ఆనందసాయిలతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు చేస్తున్న ఫొటోను మరో సినీనటుడు సంపూర్ణేశ్ బాబుతో పోల్చుతూ…హర్షవర్ధన్ రెడ్డి ఒక ఫొటోను పోస్ట్ చేశాడు.అయితే ఈ పోస్ట్ పై జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత రిషికేష్ కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో రిషికేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావలి పోలీసులు కేసు నమోదు చేశారు.