పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు నాణ్యమైన ట్రైనింగ్ ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఉచిత కోచింగ్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఎస్సీ ఓబీసీ విద్యార్థులతో పాటు పీఎం కేర్స్ లబ్దిదారులకు కూడా నాణ్యమైన కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. నిజానికి ఆరో ప్లానింగ్ ప్రణాళికలోనే ప్రారంభించిన ఈ ఫ్రీ కోచింగ్ స్కీమ్ కెపాసిటీ మరింత మెరుగ్గా చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పులు చేశారు. తాజాగా చేసిన మార్పులను పీఎం కేర్స్ లబ్దిదారులకు విస్తరించారు. ఈ విద్యార్థులకు సంబంధించి క్యాస్ట్, ఇన్ కం నియంత్రణలు తొలగించారు. యూపీఎస్సీ సివిల్స్ సహా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే అన్ని పరీక్షలు, బ్యాంక్ ఎగ్జామ్స్, వివిధ రకాల భీమా సంస్థలు నిర్వహించే పరీక్షలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు ఈ స్కీమ్ కింద ఫ్రీ కోచింగ్ ఇస్తారు.
ఫ్రీ కోచింగ్ స్కీమ్ లో మార్పులు… పీఎం కేర్స్ లబ్దిదారులకూ ఫ్రీ కోచింగ్
By admin1 Min Read