ప్రజా సేవలో తిరుగులేని నిబద్దత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.
ఆయన బాటలో కొనసాగుతాను: కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ప్రజలకు సేవచేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారని ఆయన కుమారుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన ఆలోచనలు మరియు చర్యలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నేడు నాన్న గారి 68వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు చూపించిన నిబద్ధతతో ఆయన బాటలో కొనసాగుతాను శ్రీకాకుళం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నిబద్దత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read