ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం సరికొత్త సవాళ్లను అధిగమిస్తూ కాలానికి అనుగుణంగా మార్పులు చెందుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. గ్లోబలైజేషన్ తో ప్రతి మూలకు విస్తరిస్తూ ఎందరికో ఉపాధి అవకాశాలను కొందరిని బిలియనీర్లుగా మారుస్తోంది. ఇక తాజాగా ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక అధిక సంపన్నులు ఉన్న దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అత్యధిక సంపన్నులు ఉన్న దేశంగా అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా ఉంది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 813 ఉండగా, చైనాలో ఈ సంఖ్య 406గా ఉంది. మూడో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 200గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 31 మంది బిలియనీర్లు అయ్యారు. భారతీయ బిలియనీర్ల సంపద 954 బిలియన్ డాలర్లు. భారత్‌లో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ. ఆయన సంపద విలువ 116 బిలియన్ డాలర్లుగా ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు