ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా పేలవంగా ముగించింది. లీగ్ లో ఆడిన రెండు మ్యాచ్ లలో మొదటి దానిలో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చెందగా… రెండో మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి పాలైంది. ఇక నేడు రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ తో జరగాల్సిన మూడవ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లు టోర్నీ నుండి నిష్క్రమించాయి. రావాల్పిండిలో ఉదయం నుండి వర్షం పడుతోంది. దీంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఔట్ ఫీల్డ్ నీటితో ఉండడంతో మ్యాచ్ నిర్వహణ కష్టమని భావించిన అంపైర్లు టాస్ కూడా వేయకుండా రద్దు చేశారు. చెరొక పాయింట్ తో పాకిస్థాన్ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్ -ఏ నుండి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరాయి.
వర్షంతో రద్దయిన పాకిస్థాన్ బంగ్లాదేశ్ మ్యాచ్… ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించిన పాక్
By admin1 Min Read