తొలి దళిత లోక్ సభ స్పీకర్ దివంగత నేత గంటి మోహన చంద్ర బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఘన నివాళులు అర్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
తొలి దళిత లోక్ సభ స్పీకర్, నాకు అత్యంత ఆప్తుడు గంటి మోహన చంద్ర బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అనునిత్యం పేద ప్రజలకోసం పనిచేసిన బాలయోగి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. మరీ ముఖ్యంగా దళితులకు ఆయన చేసిన సేవలు మరువలేనివి.
మంత్రి నారా లోకేష్:
దేశంలోనే అత్యున్నతమైన లోక్ సభ తొలి దళిత స్పీకర్ గా సేవలందించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన కోనసీమ ముద్దుబిడ్డ, టీడీపీ నేత స్వర్గీయ జీఎంసీ బాలయోగి గారి వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసిన మహోన్నత వ్యక్తి బాలయోగి గారు. సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ గా ఎదిగిన బాలయోగి గారి జీవితం స్ఫూర్తిదాయకం. రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ బాలయోగి గారి ఆశయసాధనకు ప్రతిఒక్కరం పునరంకితమవుదాం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు