పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే హక్కు లేనే లేదు. పోలవరం ప్రాజెక్టు పేరు వింటే వైఎస్ గుర్తుకు వచ్చే మీకు.. 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేశారు? వైఎస్సార్ జీవిత ఆశయం పోలవరం అని మీకు తెలియదా ? అధికారంలో ఉండగా తట్టెడు మట్టి అయినా తీశారా ? అని ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా ? నాడు ప్రధానికి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్ల మేరకు నిధులు విడుదల చేయాలని అడగలేదా ? వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి మీ అనాలోచిత నిర్ణయాలే కారణం అని పోలవరం అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా ? రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కుడి, ఎడుమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించి మహానేత ఆశయాలకు తూట్లు పొడిచారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే, కర్త, కర్మ,క్రియ జగన్ మోహన్ రెడ్డి అని షర్మిల ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి పచ్చి అబద్ధాలని షర్మిల ఆరోపించారు. ఎత్తు తగ్గించి 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 టీఎంసీలకు పరిమితం చేశారని ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని ఆరోపణలు చేశారు. 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి నిర్ధేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 41.15 మీటర్ల ఎత్తుకి, రూ.30,436 కోట్ల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతాం అని అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి అవాస్తవాలు కావా ? అని ప్రశ్నించారు. ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే, కేంద్ర ప్రభుత్వంతో వెంటనే అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రాజెక్టు కొత్త DPR బయటపెట్టాలని అఖిలపక్షాన్ని పిలిచి నిజానిజాలు చెప్పండి. పునరావాస చర్యలకే రూ.30వేల కోట్లు దాటుతుంటే, తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరించాలని స్పష్టం చేశారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

