భారత టేబుల్ టెన్నిస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అగ్రశ్రేణి ఆటగాడు ఆచంట శరత్ కమల్ తన 22 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ కు తెరదించుతూ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ టోర్నీతో టేబుల్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఈనెల 25 నుండి 30 వరకు ఈ టోర్నీ జరగనుంది. భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో 42 సంవత్సరాల శరత్ కమల్ ది ప్రత్యేక స్థానం. కామన్వెల్త్ క్రీడలలో 7 గోల్డ్, 3 సిల్వర్, 3 కాంస్య పతకాలు, ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు, ఆసియా ఛాంపియన్ షిప్ లో 2 కాంస్యాలు సాధించాడు. 10 సార్లు నేషనల్ ఛాంపియన్ గా నిలిచిన ఒకే ఒక్క ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. 2004లో అర్జున అవార్డు, 2022లో అత్యున్నత క్రీడా అవార్డైన మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం ఆతనిని సత్కరించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు