విశాఖలో జరిగిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు . కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , ఎంపీలు పురందేశ్వరి, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను ఎన్టీఆర్ వద్ద ఇద్దరూ అన్నీ నేర్చుకున్నామని తెలిపారు . ఆయన పుస్తకం రాస్తారని తానెప్పుడూ అనుకోలేదని రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు. ఎవరూ చేయని సాహసాన్ని ఆయన చేశారని కొనియాడారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారు. ఇటీవల ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి చొరవను ఈసందర్భంగా ఆయన ప్రస్తావించారు . రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడిందని చంద్రబాబు అన్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు ఒక వేదికపై కనిపించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read

