పిల్లల ఆత్మహత్యలు బాధాకరం. మానవతా దృక్పథంతో మన పిల్లలు అనే భావనతో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని శాసనమండలిలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులలో ఆత్మహత్య ఆలోచన లక్షణాలను ముందే గుర్తించి, వారిని స్నేహపూర్వకంగా ఆదరించి, ధైర్యం నింపాలని పేర్కొన్నారు. ఇక ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు వివరించారు.ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని దానికనుగుణంగా చేయనున్నట్లు వివరించారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.యాక్టివ్ ఏపీ పేరుతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో క్రీడలు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు విద్యార్థులకు అందేలా ఆయా కళాశాలలు- సంస్థల అనుసంధానం జరగాలన్నారు.
పిల్లల ఆత్మహత్యలు బాధాకరం…మన పిల్లలు అనే భావనతో ప్రతి ఒక్కరూ పని చేయాలి: మంత్రి లోకేష్
By admin1 Min Read
Previous Articleదగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Next Article హామాస్ కు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరిక..!