ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లతో సమావేశమైన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తో కూడా భేటీ అయ్యారు. ఏపీ పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థికాభివృద్ధికి కీలకమైన విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇప్పించడంపై కేంద్ర మంత్రితో ఫలవంతమైన చర్చలు జరిగాయి. మన విజ్ఞప్తికి సంపూర్ణంగా మద్దతు పలికిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలని సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇక ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు