ఏపీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. కాగా, పలువురు ఎమ్మెల్సీలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సత్య ప్రసాద్ సమాధానాలు ఇచ్చారు. జిల్లాలో పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదని ఈసందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం దీనిపై క్యాబినెట్ లో చర్చించలేదని జిల్లాల పునర్వ్యవస్థీకరణను వారు అస్తవ్యస్తంగా చేశారన్నారు. మడకశిర, అద్దంకి రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఉదయగిరి, ఎమ్మిగనూరు రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నట్లు సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Previous Articleకేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలు
Next Article 200కు చేరిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు..!

