రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అక్టోబర్ 2 నాటికి, తణుకు పట్టణంలో 42 పార్కులు పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు. తణుకు కూరగాయల హోల్ సేల్ మార్కెట్ ను పరిశీలించి కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అక్కడి కూరగాయల షాపుల వారికి అవగాహన కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా”స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర”…తణుకులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleఉగాది తర్వాత మొదటి విడతగా 5వేల మందికి ఇళ్ల పట్టాలు
Next Article అంతర్జాతీయ వేదికపై పాక్ తీరును దుయ్యబట్టిన భారత్

