పాకిస్థాన్ వైఖరిని మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్ ఎండగట్టింది. అంతర్జాతీయ ఇస్లామోఫోబియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి తెహ్ మినా జుంజువా మాట్లాడుతూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హారీష్ పాక్ తీరును ఎండగట్టారు. జమ్మూ కాశ్మీర్ పై పాక్ ప్రతినిధివి అసంబద్ధ వ్యాఖ్యలని ఇలా పదే పదే అవాస్తవాలు ప్రచారం చేసినంత మాత్రాన అది నిజం కాదని ఈ వ్యాఖ్యలతో వారు చేస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని ధీటుగా బదులిచ్చారు. పాకిస్థాన్ మనస్తత్వం అందరికీ తెలుసు ఇటువంటి కుటిల యత్నాలతో జమ్మూకాశ్మీర్ నిజమైన అంశాలు ఎప్పటికీ మారిపోవని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. భారత్ వైవిధ్యతను, బహుళత్వాన్ని గౌరవిస్తుందని స్పష్టం చేశారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

