ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ కు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.పవన్ కల్యాణ్‌ను విమర్శించడం ద్వారా ప్రకాశ్ రాజ్ ప్రచారం పొందాలని చూస్తున్నారని విమర్శించారు.ప్రకాష్ రాజ్ బతికేందుకు కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు నేర్చుకుని సినిమాలు చేశారని గుర్తుచేశారు.
కాగా హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం సరే కానీ,అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం తల్లి పాలు తాగి ఆ తల్లికి ద్రోహం చేసినట్లే అని వ్యాఖ్యానించారు.భాషను ప్రేమించడం తప్పు కాదని,అయితే రాజకీయ ఓటు బ్యాంకు కోసం భాషను వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు భాషతో సంబంధం లేకుండా సినిమా చేయడం సహజమని పేర్కొన్నారు.భాషను ఓ రాజకీయ హతక్రీడగా మార్చడం తగదని హితవు పలికారు.ఏకంగా ఓ ఇండస్ట్రీలో పని చేసి ఆ భాషను విమర్శించడం అవాస్తవమైన ధోరణిగా ఆయన అభిప్రాయపడ్డారు.భాషపై ద్వేషం ప్రచారం చేయడం కంటే, అందరినీ కలుపుకుని వెళ్లే విధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నీకు ప్రచారం వస్తుంది ! @PawanKalyan
ప్రకాష్ రాజ్ గారికి నా ప్రశ్న:
మీరు బ్రతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నేర్చుకున్నారు?
హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించటం ఓకే, కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం అంటే తల్లి పాలు తాగి,… https://t.co/pb5EkZliOE
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) March 15, 2025