సినీ నటుడు,వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళిను సీఐడీ కస్టడీకి అనుమతించాలన్న విజ్ఞప్తిని గుంటూరు సివిల్ కోర్టు ఆమోదించింది. సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం సీఐడీ పోలీసులు పోసానిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.ముందుగా గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం విచారణకు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పూర్వ సీఎం చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చేసిన చిత్రాలు మీడియా ముందు ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి.టీడీపీ,జనసేన నేతల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసి, దర్యాఫ్తులో భాగంగా గుంటూరు జిల్లా జైలులో ఉన్న పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

