అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎన్సీసీ ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు ఎన్సీసీ విషయంలో సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక బిట్స్ అమరావతిలో ఏర్పాటు కానున్నట్లు తెలిపారు . టాటా గ్రూప్, ఎల్ అండ్ టీ , ఐఐటీ మద్రాస్ కలిసి డీప్ టెక్ యూనివర్సిటీని తీసుకొచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఏఐ వర్సిటీ ఏర్పాటుకు యత్నిస్తున్నామని తెలిపారు. దేశంలోని టాప్ యూనివర్సిటీలను ఏపీలో అన్ని ప్రాంతాలకు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.. ఇక ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ సవరణ బిల్లు-2025ను మంత్రి నారా లోకేశ్ శాసనసభలో ప్రవేశపెడుతూ… దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందన్నారు. వివిధ ఫారిన్ వర్సిటీల క్యాంపస్ లను రాష్ట్రానికి రప్పించాలన్నది సభ్యుల అభిమతం అని మంత్రి పేర్కొన్నారు.
టాప్ యూనివర్సిటీలను ఏపీలో అన్ని ప్రాంతాలకు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నాం: విద్యా శాఖ మంత్రి లోకేష్
By admin1 Min Read

