అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన ట్రైనింగ్ బలోపేతం చేసే విధంగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో స్టేట్ ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ ఉద్యోగులు అటవీ, వన్య ప్రాణి సంరక్షణపై పటిష్టమైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణం ఉండాలని, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు. శాఖ పరిధిలో ఉన్న కొన్ని స్థలాలను సూచించారు. దివాన్ చెరువు దగ్గర ఉన్న రక్షిత అటవీ ప్రాంతంలో అకాడమీని ఏర్పాటు చేస్తే సిబ్బందికి అవసరమైన శిక్షణ, అటవీ వాతావరణాన్ని కల్పించడంతోపాటు రవాణా, తత్సంబంధిత మౌలిక సదుపాయాలూ ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక అకాడమి ఏర్పాటుకి సంబంధించి ప్రధాని మోడీ, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

