ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మార్కెట్ ధరల పర్యవేక్షణపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రులు వివరించారు. జాతీయ సగటు 3.61% కంటే ఆంధ్రప్రదేశ్ ద్రవ్యోల్బణం రేటు 2.44% తక్కువగా ఉందని దేశవ్యాప్తంగా తక్కువగా ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. వరుసగా 3 నెలలు జాతీయ సగటు కన్నా రాష్ట్ర ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు అవుతోందని పేర్కొన్నారు.
Previous Articleభారీ లాభాల్లో సూచీలు…75 వేల ఎగువకు సెన్సెక్స్
Next Article దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

