చదువులోకి మతం తీసుకురావద్దని కులం, మతం, ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నామని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని, తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరించారు. కొత్త విద్యావిధానాన్ని కాషాయికరణ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్ర బాబు ఆరోపణపై లోకేష్ ధీటుగా బదులిచ్చారు. అసంబద్ధ ఆరోపణలు చేయొద్దని మండిపడ్డారు. జీవో 117 తీసుకొచ్చిన జగన్.. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను దూరం చేశాడు.. మేము సంస్కరణలు ప్రారంభించాం.మీరు అధికారంలో ఉండగా పిల్లలకు ఇచ్చిన డిక్షనరీలో “GOD” అనే పదానికి అర్ధం ఏమి పెట్టారు ? మేము ఈ రోజు అన్ని మతాలు సమానం అని “GOD” అనే పదానికి అర్ధం ఇచ్చాం. ఈ రోజు మీరొచ్చి, మతాలను రెచ్చగొడుతూ, కాంట్రవర్సీ చేస్తున్నారని మండిపడ్డారు.
కులం, మతం, ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం: విద్యా శాఖ మంత్రి లోకేష్
By admin1 Min Read
Previous Articleబిల్ గేట్స్‌ను కలిసిన సీఎం చంద్రబాబు – ఏపీ అభివృద్ధిపై కీలక చర్చ
Next Article నేడు కూడా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..!