విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు. మరోవైపు అమ్మే నిర్ణయంలో మార్పు లేదంటూ లిఖిత పూర్వక సమాధానం ఇస్తారని ఆక్షేపించారు. పైకి ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు మోడీ గారు ఆజ్యం పోస్తూనే ఉన్నారని ఆరోపించారు . రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామంటూనే.. లోలోపల ప్లాంట్ ప్రాణం తీస్తున్నారని విశాఖ స్టీల్ పై మోడీ గారి ఫార్ములా “సైలెంట్ కిల్లింగ్”. అని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసమని ప్లాంట్ ను ఉద్ధరించామని చెప్పినవన్నీ ఉత్త మాటలని మండిపడ్డారు . విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉందని పేర్కొన్నారు. *మోదాని* కంపెనీకి అప్పనంగా కట్టబెట్టాలని చూస్తున్నారు. విశాఖ ఉక్కును చంపడంలో కర్త మోడీ గారు అయితే ఖర్మ, క్రియ చంద్రబాబు , పవన్ అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దీనిపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఇప్పటికైనా మోడీ గారు కుటిల ప్రయత్నాలు మానుకోవాలి. వెంటనే స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేయాలి. తక్షణమే అధికారిక ప్రకటన చేయాలి. ఉద్యోగులను,కాంట్రాక్టు కార్మికులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

