యునైటెడ్ కింగ్ డం పార్లమెంట్ నుండి జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య చిరంజీవి కీర్తిని మరింత పెంచనుందని ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిరంజీవి తాజాగా ఈ పురస్కారాన్ని అందుకున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటానని పవన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తానని తెలిపారు. తన జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవిని కొనియాడారు . తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు.
ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటా: ‘చిరు’కు పవన్ విషెస్
By admin1 Min Read

