టిడిపి ప్రభుత్వం విద్యార్థులు మరియు తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉందని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మునుపటి ప్రభుత్వ పాలనలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఈ ప్రభుత్వం క్రమంగా క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో ₹4,271 కోట్లు బకాయిలను వదిలివెళ్లగా, వాటిని పూర్తిగా చెల్లించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ₹788 కోట్లు విడుదల చేయగా…తాజాగా ₹600 కోట్లు విడుదల చేసినట్లు త్వరలో ₹400 కోట్లు విడుదల చేయనున్నామని తెలిపారు. విద్యార్థుల విద్య ఆర్థిక సమస్యల వల్ల ఆగిపోకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్న మంత్రి లోకేష్ బకాయిల రూపంలో ఉన్న ప్రతి రూపాయి పూర్తిగా చెల్లించబడుతుందని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు