లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు తమిళనాడు ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించింది.సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో జరిగిన ఈ సమావేశానికి ఏడు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం పాల్గొంది.ఈ సమావేశంలో డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కలిగే ప్రభావాలపై సుదీర్ఘంగా చర్చించారు.కేంద్ర ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ, దక్షిణా
ది ప్రాతినిధ్యం తగ్గకుండా సంయుక్తంగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. కేటీఆర్ ప్రత్యేకంగా ప్రసంగించి, ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొనే నష్టాలను వివరించారు. భవిష్యత్తులో దక్షిణాది ఐక్యంగా నిలిచి ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్‌తో పాటు రాజ్యసభ పక్ష నేత కేఆర్ సురేశ్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరయ్యారు. అంతేకాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖ నేతలు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. చెన్నై సమావేశం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఐక్యత మరింత బలపడుతుందని, భవిష్యత్ రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా మారుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు